Nagababu: గద్దర్ అవార్డుల వేడుక… సంచలన పోస్ట్ చేసిన నాగబాబు!

Nagababu: ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సినిమా ఇండస్ట్రీకి చెందిన కళాకారులను గౌరవిస్తూ ఇప్పటివరకు ఎలాంటి అవార్డులను కూడా ప్రధానం చేయలేదు అయితే పది సంవత్సరాల తర్వాత మొదటిసారి కళాకారుల ప్రతిభను గుర్తిస్తూ గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాదులోని హైటెక్ సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

10 సంవత్సరాల తర్వాత సినిమా పండుగలా ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గద్దర్ అవార్డుకు ఎంపికైన వారందరూ కూడా ఈ అవార్డుతో పాటు ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నారు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ, అల్లు అర్జున్ వంటి వారందరూ అవార్డులను అందుకున్నారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఇలా గద్దర్ అవార్డులను ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక తాజాగా నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా గద్దర్ అవార్డు వేడుక గురించి ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.”ప్రజా గాయకుడు గద్దర్ గారి లాంటి ఒక లెజెండ్ పేరు మీద ప్రాంతాలకి అతీతంగా కళాకారులకి గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నందుకు తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇతర ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. తెలియచేస్తున్నాను. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కళాకారులకు మీరిస్తున్న గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు” అంటూ నాగబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.