అమిత్ షా కాన్వాయ్ ని ఈ అమ్మాయిలు ఎలా ఆపారో చూడండి (వీడియో)

అలాహాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరు మహిళా విద్యార్థినులపై లాఠీ ఛార్జ్ చేసారు మగ పోలీసులు. దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవటం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.

సాధారణంగా మహిళలను అరెస్టు చేయాలంటే ఉమెన్ కాప్స్ ఉండాలి కానీ ఈ సంఘటనలో మెన్ కాప్స్ మహిళలపై తమ ఝులుమ్ చూపించారు. అలాహాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా వాహనానికి నల్ల జెండాలతో ఎదురుగా వెళ్లి “అమిత్ షా వాపస్ జావో” అంటూ ఆందోళన చేశారు ఇద్దరు విద్యార్థినులు, మరొక యువకుడు. వీరిని అడ్డుకునేందుకు మహిళలు అని కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేస్తూ, జుట్టు పట్టుకుని ఈడుస్తూ పోలీసు వ్యానులోకి ఎక్కించారు మగ పోలీసులు. ఈ చర్యపై దేశమంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ముగ్గురిని ఈ రోజు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ముగ్గురు సమాజ్ వాదీ ఛాత్ర సభ కార్యకర్తలు అని తెలుస్తోంది. పోలీసుల సమాచారం మేరకు వీరిలో నేహా యాదవ్ అనే విద్యార్థిని పీహెచ్దీ చేస్తుండగా రమా యాదవ్ అనే విద్యార్థిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. ఇద్దరు అలాహాబాద్ యూనివర్సిటీ విద్యార్థినులు.

సమాజ్ వాదీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ..”బేటీ బచావో, బేటీ పడావో” నినాదం ఉద్దేశం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం ఇటువంటి ఘటనలలో మహిళలను నియంత్రించాలంటే మహిళా పోలీసులు ఉండాలి అన్నారు. మహిళ పోలీసులను ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు.

(TOI  వారి సౌజన్యంతో)