భూత వైద్యం పేరుతో మహిళ చేతులు కాల్చేసిన మంత్రగాల్లు…!

ప్రస్తుత కాలంలో దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ప్రపంచంలో నాలుగు వైపులా జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు మూఢనమ్మకాల పట్ల విశ్వాసం చూపుతున్నారు. ఈ మూఢనమ్మకాల కారణంగా దొంగ బాబాల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ప్రజలు మాంత్రికులను నమ్మి మోసపోతున్నారు. తాజాగా రాజస్థాన్ లో కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. భూత వైద్యం పేరుతో ఒక మహిళ చేతులను కాల్చేసిన ఘటన చర్చాంషనీయంగా మారింది.

వివరాలలోకి వెళితే… రాజస్థాన్ లోని గుడా గాడ్జీ ప్రాంతానికి చెందిన మోనిక అనే మహిళ ఇటీవల తన భర్త వినోద్ కుమావత్‌తో కలిసి బదౌలోని బాలాజీ ఆలయానికి వెళ్ళింది. అయితే అక్కడున్న పూజారులు రమేష్ సైనీ, రోహితాష్ సైనీ అనే ఇద్దరూ వ్యక్తులు భూత వైద్యం పేరుతో ఆమెను ఆలయంలోని గదిలోనికి పిలిచి ఆమె రెండు చేతులపై మండుతున్న నిప్పు కణికలను వేసి, దెయ్యంను పంపిస్తున్నామని తెలిపారు. అయితే మండుతున్న నిప్పు కనికల చేతుల మీద పెట్టడంతో ఆమె చేతులు బాగా కాలిపోయాయి.

బాధితురాలి ఆర్తనాదాలు విన్న వినోద్ కుమావత్ అక్కడకు వచ్చి చూడగా, భార్య రెండు చేతులు కాలిపోయి నొప్పి భరించలేక బాధ తో గట్టిగా ఏడుస్తూ విలవిలలాడుతోంది . దీంతో వినోద్ వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తరువాత తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలిసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఆ పూజారులు వారిద్దరినీ చంపేస్తామని బెదిరించారు. దీంతో వినోద్ ఈ విషయాన్ని కూడా పోలీసులకు వివరించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.