వాట్సాప్ సూపర్ ఫీచర్ “పిక్చర్-ఇన్-పిక్చర్” గురించి తెలుసా?

వాట్సాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. పిక్చర్-ఇన్-పిక్చర్ అనే ఫీచర్ ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో తీసుకొచ్చే పనిలో ఉంది ఈ మెసేజింగ్ యాప్ సంస్థ. కొత్తగా వస్తోన్న ఈ ఫీచర్ తో ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ వాట్సాప్ లోనే చూడొచ్చు. మీకు వాట్సాప్ లో వచ్చిన యూట్యూబ్ వీడియోస్ కానీ ఇంస్టాగ్రామ్ వీడియోస్ కానీ చూడాలంటే ఆ యాప్స్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా వాట్సాప్ లోనే చిన్న విండోలో ప్లే అయ్యే సదుపాయం కల్పించనుంది వాట్సాప్. ఈ ఫీచర్ ఇప్పటికే ios లో రన్ అవుతోంది. ఇక ఆండ్రాయిడ్ లో కూడా త్వరలో అందుబాటులో రానుంది.

రీసెంట్ గా ఈ సంస్థ గూగుల్ ప్లే బేటా ప్రోగ్రాం ద్వారా వెర్షన్ 2.18.234 కి పెంచుతూ ఈ కొత్త అప్ డేట్ సబ్మిట్ చేసింది. డెవలప్మెంట్స్ రీజన్స్ వలన ఈ ఫీచర్ అధికారికంగా ఆండ్రాయిడ్ యూజర్స్ కి అందుబాటులోకి తీసుకురాలేదని, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ పూర్తి చేసి తీసుకురానున్నట్టు సమాచారం. కొన్ని నెలలుగా ఈ అప్ డేట్ పై కృషి చేస్తున్న వాట్సాప్ టీం త్వరలోనే ఆండ్రాయిడ్ కి ఈ ఫీచర్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ అప్ డేట్ అయ్యాక మీ వాట్సాప్ లో వచ్చిన యూట్యూబ్ లింక్స్, ఇంస్టాగ్రామ్ వీడియో లింక్స్ పైన ఒక వైట్ కలర్ ప్లే ఐకాన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఒక చిన్న విండోలో వీడియో పాప్-అప్ అవుతుంది. ఆ విండోని ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. అంతే కాదు ఆ వీడియో ప్లే అవుతున్నా మనం వాట్సాప్ లో చాట్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ ఫీచర్ లో. అయితే ఇప్పుడే ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాత్రం అందుబాటులో ఉండవని పేర్కొంది ఆ సంస్థ.