ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల సైబర్ నేరాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతుంది. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు సైబర్ నిరాలకు పాల్పడుతున్నారు . నిత్యం ఇలా ఎవరో ఒకరు సైబర్ నేరగాల చేతిలో మోసపోతు లబోదిబోమంటున్నారు. అయినప్పటికీ ప్రజలు అవగాహన లేకుండా తొందరపాటుతనంతో వారి చేతిలో మోసపోతున్నారు. ఇటీవల ఒక ఉపాధ్యాయురాలు కూడా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పేరాలలోకి వెళితే… కామారెడ్డి జిల్లా కల్కి నగర్ కి చెందిన విజయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు కుటుంబంతో కలిసి కాశ్మీర్ లోని వైష్ణవి దేవి ఆలయాన్ని ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో వైష్ణవి దేవి ఆలయానికి హెలికాప్టర్లో వెళ్ళటం కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేసింది. అయితే ఉపాధ్యాయురాలని ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆమెకు ఆన్లైన్ ద్వారానే హెలికాప్టర్ బుకింగ్ నెంబర్ వివరాలు అందజేశారు. ఉపాధ్యాయురాలు ఆ నంబర్ ని సంప్రదించి టికెట్ కోసం వారు అడిగినంత డబ్బు చెల్లించింది. అయితే డబ్బులు చెల్లించిన తర్వాత కూడా టికెట్ రాకపోవడంతో టీచర్ విజయలక్ష్మి మళ్లీ ఫోన్ చేసి టికెట్ గురించి ఆరా తీయగా …వారు మరింత ఎక్కువ డబ్బు కావాలని డిమాండ్ చేశారు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన విజయలక్ష్మి
దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టిక్కెట్ కోసం తన దగ్గర నుండి రూ . 18,240 సైబర్ నేరగాళ్లు వసూలు చేసినట్లు పోలీసులకు వెల్లడించింది. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరిహద్దు ప్రారంభించారు. అయితే తరచూ ఇలా సైబర్ నేరాలు జరుగుతున్న కూడా ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే తరికి ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా చదువుకున్న వారు కూడా ఇలా తొందరపాటుతనంతో మోసపోతున్నారని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి ఫేక్ వెబ్సైట్ ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.