ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజలు తమ సమయాన్ని మొబైల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్లు వాడకం పెరగటంతో మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్లో వాడకం పెరగటం వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి ఆసక్తి చూపే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి అర్ధరాత్రి వరకు ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఈ అయితే ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే మరి కొంతమంది ఈ గేమ్స్ లో బెట్టింగ్ వేసి ఎంతో నష్టపోతున్నారు. తాజాగా ఇటువంటి విచిత్ర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్వకాలంలో పాచికల ఆటలో సర్వం పోగొట్టుకున్న పాండవులు తమ భార్య ద్రౌపదిని కూడా పందెంలో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కూడా ఒక మహిళ తనని తాను కుదువ పెట్టుకున్న సంగతి ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాలలోకి వెళితే..ఉత్తర ప్రదేశ్, ప్రతాప్‌ఘర్‌కు చెందిన మహిళ లూడో అనే బెట్టింగ్ గేమ్ ఆడుతూ దానికి బానిసగా మారిపోయింది. ఇలా లూడో గేమ్ ఆడటానికి తన భర్త సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేసేది. అయితే తన భర్త సంపాదించిన డబ్బులు అన్ని అయిపోవడంతో గేమ్ ఆడటానికి ఏం చేయాలో తోచక తన యజమాని దగ్గరకు వెళ్లి అప్పు చేసింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే ఆయనకు బానిసగా ఉండేటట్లు తనని తాను తాకట్టు పెట్టుకుంది. ఆ తర్వాత అప్పుగా తీసుకున్న డబ్బుతో గేమ్ ఆడి ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకుంది. దీంతో ఓనర్ కి డబ్బులు తిరిగి చెల్లించలేక అతనితో కలిసి జీవించడం మొదలుపెట్టింది.
అయితే ఇలా తన భార్య ఓనర్ తో కలిసి ఉండటం చూసిన ఆమె భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ విషయం గురించి భార్యను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. భార్య చెప్పిన సమాధానం విని షాక్ కి గురయ్యాడు. ఆ తర్వాత ఓనర్ కి చెల్లించాల్సిన డబ్బులు తాను తిరిగి చెల్లిస్తానని వెంటనే ఇంటికి వచ్చేయమని భార్యకి చెప్పగా.. అందుకు ఆమె నిరాకరించింది. ఓనర్ కి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానని తిరిగి ఇంటికి రానని భర్తకి స్పష్టం చేసింది. దీంతో ఆమె భర్త కి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించి ఓనర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.