ప్రస్తుత కాలంలో మహిళల ఎక్కడికి వెళ్ళినా వారికి రక్షణ లేకుండా పోయింది. మహిళల సంరక్షణకై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్న కూడా వారి మీద దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా 14 ఏళ్ల మైనర్ బాలికపై నీచుడు దారుణానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై దొంగతనం నేరం మోపి ఆమెను మాటలతో బెదిరించి లొంగ తీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే… ఈశాన్య ఢిల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక తరచూ కూల్ డ్రింక్ కోసం దుకాణదారుడు దగ్గరకు వెళ్ళేది. గ తేడా అది ఇలా కూల్ డ్రింక్స్ కోసం దుకాణం వద్దకు వెళ్లిన మైనర్ బాలికపై సదరు దుకాణం యజమాని తన ఫోన్ దొంగలించిందని ఆమెపై దొంగతనం నేరం మోపాడు. అంతేకాకుండా ఫోన్ దొంగిలించావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు బాలికను బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో బాలిక భయానికి గురైంది. అయితే బాలిక భయాన్ని ఆ దుకాణదారుడు అవకాశంగా తీసుకున్నాడు.
ఆ తర్వాత బాలికకు సర్ది చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత బాలికకు మాయ మాటలు చెప్పి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. ఆ టీ తాగిన తర్వాత బాలిక స్పృహ తప్పి పడిపోయింది. దీంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ తర్వాత నుండి తరచుగా ఆమెను బెదిరించి తనుకు సహకరించకపోతే వీడియో బయట పెడతానని బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా తరచూ అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. తాజాగా ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు బాధిత బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.