ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం… వీడియో షేర్ చేయడంతో బయటపడిన నిజం?

ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే యువతీ యువకులు ప్రేమ పెళ్లి అంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే మాయ మాటలకు పడిపోయి సర్వస్వం కోల్పోతున్నారు . ఇటీవల జనగామ జిల్లాలో కూడా ఇటువంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్న యువకుడు ఆమె మీద అత్యాచారం చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన కలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…. జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన గుర్రం శ్యాం అనే యువకుడు పదహారేళ్ల మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో బాలికను లోపరుచుకొని ఆమెపై అత్యాచారం చేశాడు. బాలికపై శ్యాం అత్యాచారం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తుపాకుల సాంబరాజు వీడియో తీశాడు.

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో నలుగురు బాలికలకు ఈ వీడియో చూపించి.. తాము చెప్పినట్లు వినకపోతే వారిని కూడా ఇలా వీడియో తీస్తామని బాలికలను బెదిరించారు. అయితే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అత్యాచారం సంగతి బాధితురాలు తల్లికి తెలిసింది. దీంతో బాధితురాలు తల్లి జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.