దేశంలో పబ్లిక్ డేటా సెంటర్ల ఏర్పాటుపై కేంద్రం ప్రకటన

central government planning to setup the public data centers

దేశంలో పబ్లిక్ డేటా సెంటర్ల ఏర్పాటుపై కేంద్రం ప్రకటన.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యంగా దేశీయ స్వావలంబనకు ఉద్దేశించిన ఆత్మ నిర్భర్ పథకం..భారత్ రోజ్ గార్ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1548 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఆ తరువాత మొత్తం పథకం కాలానికి రూ. 22810 కోట్లు..అంటే 2020-2023 ఏళ్ళ మధ్య సుమారు 58.5 లక్షల మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు.ఇక దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్ ఫీజు రిజిస్ట్రేషన్ అవసరం లేదని తెలిపారు.

central government planning to setup the public data centers
modiji

దేశ వ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎండబ్ల్యూఏఎన్ ఐ కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. దీన్ని పబ్లిక్ వై-ఫై యాక్సెస్ నెట్ వర్క్. ఇంటర్ ఫేస్ ‘పీఎం వని’ గా వ్యవహరిస్తారు.ఇంకా కొచ్చి-లక్షద్వీప్ మధ్య సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రకాష్ జవదేకర్ రవిశంకర్ ప్రసాద్ వివరించారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించడానికి యుఎస్ఓఎఫ్ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసినట్లుగా ఆయన పేర్కొన్నారు .