ఆ గుర్తులు తీసి పారేయండి : ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను గురువారం సాయంత్రం కలిశారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుతో టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని కేసీఆర్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. తొలగించిన ఓట్ల విషయమై పరిశీలించాలని, లోక్ సభకు ముందే సవరణలు చేయాలని కేసీఆర్ కోరారు.

కారు గుర్తును పోలిన గుర్తులను పార్లమెంట్ ఎన్నికల్లో కేటాయించవద్దని కోరారు. తమ పార్టీ గుర్తు కారు అని ఆటో, ఇస్త్రీ పెట్టె, అగ్గి పెట్టె, ట్రక్కు గుర్తులు కారును పోలి ఉన్నాయని వాటిని కేటాయించడంతో కొంతమంది తికమక అయ్యి కారు గుర్తు అనుకొని వాటికి వేస్తున్నారని తెలిపారు. ఈ గుర్తుల కేటాయింపు వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఆయన సీఈసీకి వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.