Suicide Machine: కారుణ్య మరణాలకు ఎదురు చూస్తున్న వారికి స్విట్జర్లాండ్ కంపెనీ ఒక కొత్త మెషిన్ ని ఆవిష్కరించింది. ఎటువంటి నొప్పిలేకుండా ఒక్క నిమిషం లోనే ప్రశాంతంగా చనిపోయేందుకు ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. అయితే దీనిని ప్రభుత్వం కూడా గుర్తించి, చట్టబద్ధం కూడా చేసింది. అయితే ఇప్పుడు కారుణ్య మరణాలు ఇంకా స్విట్జర్లాండ్ లో చట్టబద్ధం అన్నమాట. ఇటువంటి కారుణ్య మరణాల కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా స్విట్జర్లాండ్ లో నడుస్తున్నాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం.. గత సంవత్సరం 1300 మంది ఇటువంటి సంస్థల ద్వారా కారుణ్య మరణాలు పొందారు. ఇలాంటి సంస్థలలో ” ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ” అనే సంస్థ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సంస్థకి డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ ఫిలిప్ నిట్చికే కారుణ్య మరణాల (సూసైడ్ ) మెషిన్ ని కనుగొన్నాడు. అయితే ఈ డాక్టర్ ని స్థానికులు డెత్ డాక్టర్ అని కూడా పిలుస్తారు. శవపేటిక ని పోలి ఉన్న ఈ మెషిన్ ఎక్కడికైనా తీసుకు వెళ్లొచ్చు.
ఇదెలా పనిచేస్తుందంటే.. మనిషిని లోపల పడుకోబెట్టగానే ఈ మెషిన్ ఆక్సిజన్ లెవల్స్ ని తగ్గించేస్తుంది. రక్తంలో ఉన్న కార్బన్ డైయాక్సిడ్ కూడా తగ్గించుకోవడం వలన నొప్పి లేకుండా చనిపోతారట. దీనిని లోపల నుండే కాకుండా బయట నుండి కూడా ఆపరేట్ చెయ్యొచ్చు అని ఫిలిప్ నిట్చికే చెప్పారు. శరీరం అంతా చచ్చుబడి కేవలం కళ్ళు కదపగలిగే స్థితిలో ఉన్నపేషంట్లకి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది అని అన్నారు. కనురెప్పలు ఆర్పుతూ, తెరవడం ద్వారా ఈ మెషిన్ ని ఆపరేట్ చెయ్యొచ్చు అని తెలిపారు. అయితే ఈ గ్యాస్ ఛాంబర్ కి గ్లామర్ జోడించి తయారు చేసారని విమర్శకులు మండిపడుతున్నారు.