ఆహారంలో పాము తల.. వైరల్ అవుతున్న వీడియో!

కొన్ని కొన్ని సార్లు బయట తినే ఆహారంలో కొన్ని రకాల విష పురుగులు వంటివి వస్తుంటాయి. ఇలా ఏవైనా విష జీవులు తినే ఆహారంలో కనిపిస్తే వెంటనే వాటిని సోషల్ మీడియాలో పంచుకొని తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇస్తుంటారు. అలా తాజాగా ఓ తినే ఆహారంలో ఏకంగా పాము తల కనిపించడంతో అందరూ షాక్ తిన్నారు.

అసలేం జరిగింది అంటే.. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలో డస్సెల్ డార్ఫ్ కు వెళ్తున్న సన్ ఎక్స్ప్రెస్ విమానంలో ఆహారం వడ్డించిన ప్లేటులో పాము తల కనిపించింది. దీంతో వెంటనే ఫుడ్ కాంట్రాక్టర్ తో డీల్ రద్దు చేసాము అని.. ప్రస్తుతం దీని గురించి విచారణ జరుగుతుంది అని ఎయిర్ లైన్స్ తెలిపింది. కానీ ఆ సంస్థ తాము జాగ్రత్తగా ఫుడ్ తయారు చేస్తున్నామని పేర్కొనగా.. తమ ఆహారంలో వచ్చిన పాము తల వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.