ఆర్నబ్ ని అరస్ట్ చేసిన ‘ సూసైడ్ ‘ కేసు ఇదే .. దీనివెనక ఇంత కథ జరిగిందా ?

Arnab Goswami has been arrested for the suicide of a interior designer

11:35:27ముంబై: ఇంటరీయర్ డిజైనర్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై ముంబై పోలీసులు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతో 53 ఏళ్ల ఇంటీరియర్…డిజైనర్, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణపై అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్య సంఘఠన 2018లో జరిగింది.

Arnab Goswami has been arrested for the suicide of a interior designer
Arnab Goswami has been arrested for the suicide of a interior designer

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ 2018 మేలో అలిబాగ్ లోని తమ భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో రాయ్ గడ్ పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అది అన్వయ్ నాయక్ రాసినట్లుగా పోలీసులు భావిస్తుున్నారు.

ఐకాస్ట్ఎక్స్/స్కైమీడియాకు చెందిన ఫిరోజ్ షేక్, అర్నబ్ గోస్వామి, స్మార్ట్ వర్క్స్ కు చెందిన నితీష్ శారద తనకు రావాల్సిన రూ.5.40 చెల్లించలేదని, దాంతో తాను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నానని ఆ ఆ సూసైడ్ నోట్ రాశాడు. షేక్ తో పాటు శారదను కూడా రాయగఢ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

అన్వయ్ మొదటి అంతస్థులో ఉరేసుకుని శవమై కనిపించాడు. కుముద్ శవం గ్రౌండ్ ఫ్లోర్ లో కనిపించింది.అన్వయ్ పెద్ద యెత్తున అప్పుల్లో కూరుకుపోయాడని, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేని స్థితికి చేరుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.