దేశం లో తగ్గిన కరోనా ఉదృతి.. లక్ష దిగువకు యాక్టివ్ కేసులు!

దేశం లో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి భారీ ఊరట లభించినట్లయింది. కొత్త కేసుల ఉద్ధ్రుతి క్రమంగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు దేశంలో కరోనా ఉద్ధ్రుతి నిలకడగా కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,07,680 మందికి టెస్టులు చేయగా కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయి. దేశం లో మొన్నటితో పోలిస్తే 1287 కేసులు తగ్గాయి. ప్రస్తుతం 99,879 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దిగువకు పడిపోయింది. ఈ మహమ్మారి వల్ల తాజాగా దేశంలో 34 మందికి పైగా మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,27,332 కు చేరుకుంది. పాజిటివిటీ రేటు 4.21 శాతానికి చేరింది. ముందు రోజు కంటే కేసులు కాస్త తగ్గాయి.

2020 ప్రారంభం నుంచి 4.43 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.58 శాతం మంది ఈ మహమ్మారి నుండి బయటపడ్డారు.
అయితే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో కేసులు పెరుగుతూ ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు రోజుకు 1000 కి పైగానే ఉంటున్నాయి. దేశంలో, 13,900 మంది కరోనా నుండి కోలుకున్నారు. 36 మంది కరోనా వల్ల మృతి చెందారు.

దీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,12,218 కి చేరుకుంది. ఇక రికవరీ రేటు 98.59 గా ఉంది. క్రియాశీల రేటు 0.23 శాతంగా నమోదు అయింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 209,67,06,895 కరోనా వ్యాక్సిన్ దోస్తులు ప్రజలకు అందజేశారు. నిన్న ఒక్కరోజే 26, 58,755 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేశారని కేంద్రం తెలిపింది.