Corona Vaccine: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ తీసుకున్నప్పటికీ కరోనా కేసులు పెరగడానికి కారణాలు ఇవే..!

Corona vaccine: దేశంలో కొత్త కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల నుండి రోజు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే వాక్సినేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ నియమాలను పాటించాల్సిందేనని నిపుణులు, శాస్త్రవేత్తలు ముందే చెప్పారు.

టీకా అనేది శరీరంలో యాంటీబాడీస్ ని, రోగనిరోధకశక్తిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది . టీకా తీసుకున్నంత మాత్రాన కరోనా సొకదని అనుకోకూడదు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ వేగంగా ఉన్నప్పటికీ ఇతర వేరియంట్లతో పోల్చితే దీని ప్రభావం తక్కువగానే ఉంది అని నిపుణులు చెబుతున్నారు. బహుశా ఇది వాక్సిన్ తీసుకోవడం వల్ల శరీరం మీద వ్యాధి ఎక్కువ ప్రభావం చూపడం లేదేమో.

టీకా తీసుకోని వ్యక్తులు కరోనా బారిన పడితే దాదాపుగా ఆక్సిజన్ అవసరం పడవచ్చు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులతో పోల్చితే , వ్యాక్సిన్ తీసుకున్న వారి మీద ఒమిక్రన్ అంతగా ప్రభావం చూపటం లేదు. టీకా తీసుకున్న వ్యక్తులలో కరోనా 3 నుండి 4 నాలుగు రోజులలో సాధారణ స్థితికి వస్తోంది.

వ్యాక్సిన్ అనేది వ్యాధి యొక్క తీవ్రత వల్ల శరీరానికి కలిగే నష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోవచ్చు. అది వారి వయసు ,ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఇది వరకే నాలుగు నుండి ఐదు నెలల ముందు రెండు డోసులు ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. వ్యాక్సిన్ ప్రభావం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారిలో రోగనిరోధకశక్తిని పెంచడానికి ఇప్పుడు బూస్టర్ డోస్ ని ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.