తల్లిదండ్రుల మెడపై కత్తి పెట్టి రూ. 1.14 కోట్లు కొట్టేసిన కొడుకు..!

ప్రస్తుత కాలంలో డబ్బుకి ఉన్న విలువ బంధాలకు బంధుత్వాలకు లేకుండా పోయింది. డబ్బు కోసం ప్రజలు ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తొడగొట్టిన వారు కన్నా తల్లిదండ్రులని తేడా లేకుండా ఆస్తుల కోసం వారిని హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడిన యువకుడు డబ్బు కోసం తల్లిదండ్రుల మెడపై కత్తి పెట్టి వారిని బెదిరించి రూ.1.14 కోట్లు కజేసాడు. కొడుకు చేసిన పనికి భయాందోళనకు గురైన ఆ భార్య భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…ముంబైలోని బాంద్రా వెస్ట్‌ రిక్లమేషన్ సమీపంలోని పారిజాత్ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ దౌండ్కర్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఆ యువకుడు దేశాలకు అలవాటు పడటమే కాకుండా వ్యాపారంలో కూడా బాగా నష్టపోయాడు. ఈ క్రమంలో డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను కత్తితో బెదిరించి వారి నుంచి రూ. 1.14 కోట్ల డబ్బులు కాజేశాడు. అంతే కాకుండా గతంలో కూడా ఇలా తమ వంశ దైవం అయిన గణేశుడి బంగారు కిరీటం తో పాటు ఇంట్లో ఉన్న బంగారు గొలుసులు, తల్లికి చెందిన 12 బంగారు గాజులు, ఇంట్లో ఉన్న ఇతర నగలు కూడా ఎత్తుకెళ్లినట్లు ఆ దంపతులు పోలీసులకు వెల్లడించారు.

ఇక ఇటీవల కూడా వారిని చంపేస్తానని బెదిరించి మెడపై కత్తి పెట్టి నెఫ్ట్ ద్వారా కోటి రూపాయలు తన అకౌంట్‌లోకి వేసుకున్నాడు. ఇలా తరచూ డబ్బుల కోసం కన్న కొడుకు వారిని వేధించటంతో ఆ తల్లితండ్రులు ఇటీవల బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక రాహుల్ దౌండ్కర్‌ను అదుపులోకి తీసుకొని అతనిపై చీటింగ్, క్రిమినల్ కేసులు పెట్టారు. అతని బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి రాహుల్ ఇలా డబ్బు కాజేస్తున్నాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.