ఆస్కార్స్ లో జూ.ఎన్టీఆర్ పేరు..కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదేనట.!

Ramaraju For Bheem, junior ntr look revealed in RRR

జస్ట్ గత రెండు రోజులు కితం వరకు సోషల్ మీడియాలో సూపర్ టాలెంటెడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. దీనికి గల కారణం కూడా ఏంటో చాలా మందికే తెలుసు. తాను లేటెస్ట్ గా నటించిన భారీ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) లో తాను చేసిన పాత్ర భీమ్ కి గాను ఉత్తమ నటుడుగా ఏకంగా ఆస్కార్ అవార్డు వస్తుంది అని ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్ సంస్థ “వెరైటీ” వారు పబ్లిష్ చేశారు.

దీనితో అయితే అలాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థే ఎన్టీఆర్ కోసం వేసింది అంటే ఇక ఎన్టీఆర్ కి ఆస్కార్ వచ్చేసినట్టే అనే రేంజ్ లో రచ్చ లేచింది సోషల్ మీడియాలో. అయితే ఇదంతా బాగానే ఉన్నా కొందరు మెగా, ఇతర కొందరు నెటిజన్స్ అసలు నిజం అది కాదని అంటున్నారు.

ఆ సంస్థలో 1000 డాలర్స్ దాటి ఇంత మొత్తం అని చెల్లిస్తే ఇటువంటి ప్రిడిక్షన్స్ ని ఎవరైనా సరే రాయించి అందులో పబ్లిష్ చేయించవచ్చు అని ఇది చాలా మందికి తెలియదని అంటున్నారు. దీనితో అసలు ఎన్టీఆర్ ఆస్కార్స్ కి వెళ్లడం అనేది జరిగే పని కాదని అంటున్నారు.

కాకపోతే సినిమా పరంగా డైరెక్షన్ పరంగా వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయని మాత్రం ఇంగ్లీష్ ఆడియెన్స్ బాగా అంటున్నారు. కానీ నటుల్లో మాత్రం ఎన్టీఆర్, చరణ్ ఇద్దరికీ ఎక్కడ బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని మాత్రం చెప్పలేదు.