సిబిఐ వివాదంలో మోదీ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్

భారత దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వివాదంలో చిక్కుకున్నది. సిబిఐ ని సరైన బాటలో నడిపేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిబిఐ వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇవీ.

సిబిఐలో అంతర్గత వివాదాలు పొడసూపడంతో గతంలోడైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపింది కేంద్ర సర్కారు. దీంతో తనను సెలవుపై పంపడాన్ని అలోక్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

సిబిఐ వివాదం పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను కేంద్ర ప్రభుత్వం లీవ్ పై పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 

కేంద్ర ప్రభుత్వం సిబిఐ వివాదం పై తీసుకున్న నిర్ణయాన్ని దేశ అత్యున్నత ధర్మాసనం ఆక్షేపించింది. ఆలోక్ వర్మకు తిరిగి సిబిఐ డైరెక్టర్ గా భాద్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మకు సుప్రీంకోర్టు లో పెద్ద ఊరట లభించినట్లైంది.

ఆలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అలోక్ వర్మను సెలవు పై పంపడం కుదరదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. 

సివిసి, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది సుప్రీంకోర్టు. ఆలోక్ వర్మ పై కేంద్రం నిర్ణయాన్ని సెలెక్ట్ ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.