భారత దేశంలో మొట్టమొదటి సారి ఇంజన్ లేని రైలు పట్టాల మీద పరిగెడబోతున్నది. అంతేకాదు, అదే అతి వేగంగా ప్రయాణించే భారతీయ రైలు. ఇంతేనా, ఇంకావుంది. ఈ రైలు ను పూర్తిగా దేశీయంగా తయారు చేశారు. తయారయింది చెన్నై సమీపంలోని పెరంబూర్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15 వ తేదీన ఈరైలును న్యూఢిల్లీ స్టేషన్లో ప్రారంభిస్తున్నారు. ఈ రైలు పేరును ట్రెయిన్ 18 నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేశారు.
ఢిల్లీ ముంబై రాజధాని ఎక్స్ ప్రెస్ రూట్ లో జరిగిన టెస్ట్ రన్ లో ఈ రైలు గంటకి180 కిమీ వేగం చేరుకుందని అధికారులు చెప్పారు. ఈరైలుకు 16 బోగీలుంటాయి. ఢిల్లీ వారణాశి మధ్య ఈ రైలు నడుస్తుంది. శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్థానంలో ఈ రైలును నడుపుతారు.