మోడీపైనా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైనా ట్రోలింగ్.!

దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఖ్యాతికెక్కింది. ప్రస్తుతానికైతే దేశంలో ఈ తరహా రైళ్ళు కేవలం నాలుగే వున్నాయి. మొన్నీమధ్యనే నాలుగో రైలు అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ రైళ్ళను వివిధ మార్గాల్లో ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకు వేగంగా ప్రణాళికలూ రచిస్తున్నారు.

జపాన్ లాంటి దేశాల్లో బుల్లెట్ రైళ్ళు అత్యంత వేగంతో దూసుకుపోతాయ్. కొన్ని రైళ్ళ వేగం గంటకు 400 కిలోమీటర్లు.. ఆపైన కూడా వుంటాయ్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం ప్రస్తుతానికి గంటకు 2‌00 కిలోమీటర్ల లోపు మాత్రమే. త్వరలో పట్టాలెక్కనున్న రెండో తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ వేగం గంటకు 200 కిలోమీటర్ల మేర వుంటుందట.

తాజాగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలొకదానికి ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై ఆ రైలు, గేదెల్ని ఢీకొంది. దాంతో, నాలుగు గేదెలు మరణించాయి. రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బ తింది. అయితే, కేవలం ఇంజిన్ ముందు భాగంలో జరిగిన డ్యామేజీని కేవలం ఇరవై నాలుగ్గంటలోనే సరిచేసేశారు.

అయితే, ‘ఇప్పుడు జంతువులు ప్రాణాలు కోల్పోయాయ్.. రేప్పొద్దున్న మనుషులకీ ఇలాంటి పరిస్థితి వస్తే.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఔత్సాహికులు ప్రశ్నించేస్తున్నారు. కానీ, 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్ళినా, పట్టాలపై మనుషులు లేదా జంతువులుంటే ప్రమాదాలు జరుగుతాయ్.. ప్రాణాల పోతాయ్.!

పట్టాలపైకి జంతువులు, మనుషులు వెళ్ళకూడదని రైల్వే చట్టాలు చెబుతున్నాయ్. కానీ, ఎవరూ వాటిని పట్టించుకోవడంలేదు. రైలు పట్టాల మీద కంచె వేయడం.. అనేది సాధ్యమయ్యే పని కాదు.. సువిశాల భారతదేశంలో. అన్నటికీ ట్రోలింగ్ అంటే ఇలానే తగలడుతుంది. మరీ ముఖ్యంగా రైళ్ళనీ, ప్రధాన మంత్రినీ.. ఇలాంటి విషయాల్లో ట్రోలింగ్ అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.