కొందరు మూర్ఖులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్దం కాదు. ఏదో సరదాకు చంపడం, బోర్ వస్తే కిడ్నాప్‌లు చేసి బెదిరించడాలు కొందరికి కామన్ హాబీస్‌గా మారాయి. ఒక్కోసారి వారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా వారికి కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది.తాజాగా ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద జరిగిన ఈ సంఘటన వీటకి నిలవెత్తు నిదర్శనం. ఓ పాదచారి తన పనిమీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోతుంటే గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు.
దుండగుడు నుండి పాదచారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సన్నివేశాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికారక్డ్ అయ్యాయి. ఇద్దరికి ఏ సంబంధం లేదు, శతృత్వం అంతకన్నా కూడా లేదట. కాని ఎందుకో పోతున్న వ్యక్తిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు దుండగుడు. పాదచారి చాకచక్యంగా తప్పించుకోవడంతో క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆ దుండగుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అతడు డబ్బులు కోసమైతే దాడి చేయలేదని, హత్య చేసేందుకు కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడని తెలిపారు.
పాదచారుడు కొరియర్ కంపెనీ ఎంప్లాయి అని తెలుస్తుండగా, అతని ఫ్రెండ్‌ని కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. కుర్లా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. అయితే నిందితుడి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించగా, అతను ఎందుకు అలా చేశాడనే దానిపై ఆలోచన చేస్తున్నారు. కక్ష వలన అయి ఉంటుందా, లేదంటే మతిస్తిమితం లేకపోవడం వలన దాడి చేసేందుకు తెగపడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.
#WATCH | Man survives knife attack, on a pedestrian bridge in the Kurla area in Mumbai, Maharashtra (28.11.2020)
“There was no attempt by the attacker to appropriate any money. It only seems to be an attack with an intent to cause grievous injury or death,” says a police officer pic.twitter.com/xjhOEjQPuB
— ANI (@ANI) December 2, 2020