హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాహుల్ మోదీ, కెసిఆర్ ని ఉద్దేశించి పలు విమర్శలు చేస్తున్నారు. వీరిది అవినీతి పాలన అని, పేదల నుండి దోచిన ధనం ధనికులకు పెడుతున్నారని అన్నారు. ప్రోజెక్టుల పేరుతో అవినీతి చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో వీరు చేసే అవినీతికి వారు పెట్టుకున్న పేరు రీడిజైన్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి కేటీఆర్.
మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా రాహుల్? ఒకసారి వేదికపైన చూడండి. మీ పక్కన కూర్చున్నవారిలో సగం మంది బెయిల్ పైన బయట ఉన్నవారే. కొనదరివి సిబిఐ కేసులైతే మరి కొందరు అవినీత్ కేసుల్లో ఉన్నవారు. ఓ, నేను మర్చిపోయాను…మీది “స్కాంగ్రెస్” పార్టీ కదా అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫోర్స్, సి ఫర్ కామన్ వెల్త్… ఇంకా కొనసాగించమంటారా రాహుల్ అని ప్రశ్నించారు?
You talk about corruption Rahul Ji? Look around on the Dias; half the people sitting next to you are out on bail !! Some in CBI cases & others in corruption cases
Oh, I forgot it’s the “Scamgress” party
A for Adarsh
B for Bofors
C for Commonwealth…..Want me to go on Sir??
— KTR (@KTRTRS) August 14, 2018