ఢిల్లీలో కోదండరాం బిజీ బిజీ

డిల్లీ పర్యటనలో ఉన్న టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆప్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆమ్ ఆద్మీ మోహల్లా క్లినిక్ ను పరిశీలించారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లిలోని బస్తీలలో ప్రవేశపెట్టిన ఈ క్లినిక్ ల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న విదానాన్ని, ప్రజల చెంతకు వచ్చి వైద్యం అందించే విధానాన్ని డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ క్లినిక్ ల ద్వారా చాలా మంది పేదవారికి సకాలంలో వైద్యం అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

టిజెఎస్ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఢిల్లి పర్యటన సాగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ బతుకులు బాగుపడుతాయనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది. ఉన్న ప్రభుత్వం సక్కగా పనిచేయట్లేదని ఆనాడు తెలంగాణ కోసం పోరాడితే ఈనాడు బతుకుల బాగుకోసం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని కోదండరాం చాలా సార్లు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు పనిచేయట్లేదని అది జరగాలంటే మార్పు జరగాలని ఆయన చాలా సార్లు అన్నారు.

కోదండరాం రాజకీయ పార్టీ పెట్టాక రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు బస్సు యాత్ర కూడా చేశారు. ఆయనకు అడుగడుగునా టిఆర్ ఎస్ ప్రభుత్వం ఆటంకాలు పెట్టింది. ఆయన ఏం చేసినా ఏదో రకంగా అడ్డు పుల్ల వేసింది. కోదండరాం కోర్టులలో కెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభలకు కూడా ఆటంకాలు కల్పించింది. రాజకీయంగా నే దెబ్బ కొట్టాలనుకున్న కోదండరాం ప్రజలల్లో టిజెఎస్ విస్తరణ కోసం తీవ్రంగా నే కృషి చేస్తున్నారని నాయకులు అంటున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేనిఫెస్టో ముఖ్యం కాబట్టి ఆయన పర్యటించిన ప్రాంతాలలో అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాల గురించి తెలుసుకుంటున్నాడు. దాంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో మేనిఫెస్టో లో చేర్చాల్సిన అంశాలపై ఆయన ప్రణాళిక వేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి కోదండరాం తెలంగాణ రాజకీయాలలో మరో కీలక పాత్ర పోషించబోతున్నారన్న చర్చ జరుగుతుంది.