ఒక్క వ్యక్తి వల్ల తెలంగాణ రాలేదంటున్న కోదండరామ్..

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో హాజరయ్యే అక్కడ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో అక్కడ మీడియాతో కూడా మాట్లాడాడు. ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఉద్యమాలు చేశారని.. తెలంగాణ రాష్ట్రం ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదంటూ అనేకమంది పోరాటాల వల్ల వచ్చిందని అన్నారు.

ఆ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడిందని.. ఈ రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు బలిదానాలు చేశారు అని.. కానీ ఇప్పుడు నిరంకుశ పాలన నడుస్తుంది అని.. ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయింది అని అన్నారు. ఎలాగైనా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తాము అని అన్నారు.