ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన కోదండరామ్.. తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం ఖాయమంటూ!

తాజాగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయారని అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని కోపం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కూడా తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం ఖాయం అని అన్నారు.

ఇక ఈ నెల 6న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవ దీక్షలు చేపట్టనున్నట్లు అన్నారు. ప్రజా ఉద్యమాన్ని ఏర్పరచుతామని, వరంగల్ లో 24 వేల ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైందని.. ఆ నేపథ్యంలో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది అని తెలిపారు.