టీఆర్ఎస్ గెలుపులో ముఖ్య పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, బీజేపి.. లక్కంటే ఇదే కాబోలు.. !

 

ఏపీ రాజకీయాల్లో ఉన్నంత సస్పెన్షన్ లేకున్నా తెలంగాణ రాజకీయాల్లో జిమ్మిక్కులు మాత్రం ఉంటాయి.. ఇక తెలంగాణలో ప్రతి సారి వచ్చిన ఎన్నికల్లో గులాభి మాయాజాలం ఏంటో గానీ ఎన్ని ప్రతికూల పరిస్దితులు ఎదురైనా టీఆర్ఎస్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు.. ఇలా అన్ని నియోజక వర్గాల్లో దాదాపుగా విజయఢంకా మోగిస్తూ కేసీయార్ పాలనలో తిరుగు లేకుండా కొనసాగుతున్నాడు.. అయితే ప్రతి సారి గులాభి పార్టీని వాడిపోయేలా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని బెడిసి కొడుతున్నాయి. దీనికి కారణం ఏపీలో మాదిరిగా విపక్షాలన్నీ ఇక్కడ ఒక్కటిగా ఉండకపోవడం..

ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడూ నిప్పూ ఉప్పూలా చిటపటలాడుతుండటం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలసి వస్తుందట.. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు బలం ఉంది. కానీ దీన్ని సరిగా ఊపయోగించు కోవడంలో ఆ నాయకులు వెనకబడ్డారట.. అదీగాక తెలంగాణలో విపక్షాలు విడివిడిగా పోటీ చేయడమే కేసీఆర్ కు కలసి వస్తుందంటున్నారు విశ్లేషకులు.. గత శాసనసభ ఎన్నికల్లో మహాకూటమిగా కాంగ్రెస్ తో కలసి ఇతర పార్టీలు జత కట్టినా బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసిందన్న విషయం తెలిసిందే.. ఇక దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొన్నది.. అంటే ఓట్లు చీలే అవకాశం ఉందన్నమాట.. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం అధికార టీఆర్ఎస్ కు లాభం తెచ్చిపెడుతుంది అంటున్నారు విశ్లేషకులు..

త్వరలో దుబ్బాక ఉప ఎన్నికతో పాటు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ లో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్ కు కలసి వచ్చే అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ పోటీ చేయాలనుకుంటున్న నేపధ్యంలో అన్ని పార్టీలు కలసి ఆయనకు మద్దతిస్తే గెలుపు ఖాయమవుతుంది.

కానీ ఇక్కడ బీజేపీ బరిలోకి దించే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని పోటీకి దింపాలని దాదాపుగా నిర్ణయించింది. ఈ క్రమంలో విపక్షాలన్నీ అధికార పార్టీ వ్యతిరేక ఓటను చీల్చుకుని కేసీఆర్ పార్టీకి మేలు చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.. అంటే టోటల్‌గా టీఆర్ఎస్ విజయంలో కాంగ్రెస్, బీజేపీలే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్న మాట..