మహారాష్ట్రపై దృష్టి పెట్టిన కేసీఆర్.. అక్కడ సక్సెస్ కావడం సులువేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో కూడా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఫిక్స్ అయ్యారు. పార్టీ పరంగా చిన్నచిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పార్టీని అధికారంలోకి రాకుండా చేసే స్థాయి సమస్యలు అయితే కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే కేసీఆర్ ప్రస్తుతం మొదట మహారాష్ట్ర రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

కొందరు తెలంగాణ మంత్రులు ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీకి పాపులారిటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. మహారాష్ట్రలో పార్టీకి మంచి గుర్తింపు దక్కితే ఇతర రాష్ట్రాల్లో పాపులారిటీని పెంచుకోవడం కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు లేవు. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం కేసీఆర్ కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ విస్తరణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కేసీఆర్ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తుండగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి. ప్రధానంగా చిన్న పార్టీల విలీనంపై కేసీఆర్ దృష్టి పెట్టారని తెలుస్తోంది. కేసీఆర్ ప్లానింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ద్వారా పీఎం కావాలని అనుకుంటున్న కేసీఆర్ కోరిక ఏమవుతుందో చూడాలి. కేటీఆర్ ను సీఎంగా చూడాలని కొంతమంది ఆకాంక్షిస్తుండటం గమనార్హం. కేసీఆర్ పీఎం, కేటిఆర్ సీఎం కావలని భావిస్తున్న అభిమానుల ఆకాంక్ష ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.