తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోజిఎంతో బాధపడుతున్న ఆయన కావేరి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
కరుణానిధి 1924 లో మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుక్కువలైలో(నాగపట్నం జిల్లా) జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అజుగం. వీరికి కరుణానిధితో పటు ఇద్దరు కుమార్తెలు పెరియనాయగం అమ్మాళ్, షణ్ముగసుందరతమ్మాళ్. వీరు తమిళనాడు నాయీబ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.
కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. ఈయనకు ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం. మొదటి భార్య పేరు పద్మావతి అమ్మాళ్, రెండవ భార్య దయాళు అమ్మాళ్, మూడవ భార్య రజాతి అమ్మాళ్.
కరుణానిధి మొదటి భార్యతో కలిగిన సంతానం
కుమారుడు ఎం.కె. ముత్తు అతని భార్య శివగైసుందరి. మనవడు డాక్టర్ అరివునితి, మనవరాలు తేన్మోళి.
కరుణానిధి రెండవభార్యతో కలిగిన సంతానం
1. కొడుకు ఎం.కె. అళగిరి అతని భార్య కంతీ. మనవడు దురై దయానిధి, మనవరాళ్లు అంజుగం సెల్వీ (అమెరికాలో స్థిరపడింది), రెండవ మనవరాలు కయళ్విళి.
2. ఎం.కె. స్టాలిన్ అతని భార్య దుర్గావతి. మనవడు ఉదయనిధి భార్య కిరుతిక. మనవరాలు సెంతామరై ఈమె భర్త శబరీషన్.
3. ఎం.కె.తమిజరాసు భార్య మోహన. మనవడు అరుళ్‌నిధి, మనవరాలు పూంగుజళి.
4. కూతురు సెల్వి భర్త మురసోళి సెల్వం.
మూడవభార్యతో కరుణానిధి సంతానం
కూతురు కనిమొళి ఆమె భర్త అరవిందన్. మనవడు ఆతిథ్యన్.
కుటుంబం అంతా అళగిరి కుమారుడు దురై దయానిధి వివాహ సందర్భంగా కలిశారు.
ప్రస్తుతం కరుణానిధి కొడుకు స్టాలిన్, కూతురు కనిమొళి తమిళనాడు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు.