అల్విదా… కలైన్జర్  కరుణానిధి

( డాక్టర్  గుఱ్ఱం సీతారాములు*)

 
“ఉత్తర భారతాన ఒక్క రాక్షసుడూ పుట్టలేదు, దక్షిణాన ఒక్క దేవుడూ పుట్టలేదు” లంకలో పుట్టిన వారంతా లంఖిని సంతానాలే ” ఇంత దుర్మార్గమైన వివక్ష ఈ భారతమాత పెంచి పోషించింది. దక్షణ సంతానాన్ని సవితి బిడ్డలుగానే చూసింది. ఉత్తర దక్షణ దృవాలు సామాజికగా, సాంస్కృతికంగా కలవని కనుపాపలలా విడిపోయాయి. దక్షిణ భాషా సంస్కృతుల దాష్టీకం మీద మొదట తిరుగుబాటు చేసింది తమిళ సమాజం.

రాజభాష పేరుతో తమిళ, తెలుగు, కన్నడ,మల్లూ ప్రాదేశికత మీద జరిగిన భాషా దండయాత్రను, ప్రమాదాన్ని ముందే పసి గట్టినవాడు అయోతి దాస,పెరియార్. ఆర్య ప్రవచిత ఆధిపత్య వ్యతిరేక మూలాలు ద్రవిడ మూలల్లో వెతుకున్న వాళ్ళు ఇది కేవలం భాషా దండయాత్ర మాత్రమె కాదనీ, అదొక బ్రాహ్మణీయ సామ్రాజ్యవాదం దాష్టీకం అని సూత్రీకరించారు. (ఈ మధ్య కళ్యాణ రావు ఎక్కువగా ఈ అంశం మీద రాస్తున్నాడు) రామ రావణ వైరాన్ని హేతుబద్దంగా, ఆధిపత్య చర్చను బద్దలు కొట్టిన తమిళ సమాజానికి ఈ దేశంలో అన్ని స్వాభిమాన ఉద్యమాలూ రుణపడి ఉండాలి. ఈ ఋణం ఖర్మ సిద్దాంత ఋణం కాదు.

శ్రామికుల విముక్తి రాజకీయ ఎజెండాగా బయలుదేరిన వామపక్ష,విప్లవ రాజకీయాల కన్నా బలమైన సైద్దాంతిక పునాదిని తమిళ సమాజం ప్రోది చేసుకుంది. ఈ కుట్రను పసిగట్టే తమిళ సమాజం ఎరుపును నలుపుతో చెరిపేసింది. ఒక స్వాభిమాన ఉద్యమానికి ఊపిరులు ఊదిన తమిళ స్ఫూర్తి ‘ఈలం’ను కాపాడు కోలేక పోయింది. ఒక నాడు కొలత్తూర్ లో ‘ఈలం’కు ఆయుధ శిక్షణ ఇచ్చిన తమిళ సమాజం ఆధిపత్య రాజకేయాల్లో పడి సంపద చుట్టూ తిరగిన కరుణ ‘ప్రభ’, ప్రభాకరన్ అవతనం తోనే అంతం అయ్యింది. మిగిలింది వొట్టి కాయమే. అది ఉన్నా పోయినా వొకటే.

ప్రభాకరన్ అమరత్వం తర్వాత ఈలం మీద కొంత మంది తమిళ మిత్రులు కొలత్తూర్ మణి(ప్రవాసి) తో ఎఫ్లూలో మీటింగ్ సందర్భంగా కొలత్తూర్ యాది లో ఒక రోజు గడిచింది.ఒక ప్రాంతీయ పార్టీ ఎంత ధైర్యంగా ఆపని చేయగలిగింది అనిపించింది. ఏది ఏమయినా నాకు తమిళ సమాజం పెరియార్ ఆలోచన మొదలు అలోసియస్, M.S.పాండ్యన్ దాకా ఒక దారి చూపింది.

జాతి జాతీయ వాదం పేరుతో జరిగిన సంకుల సమరం లో ఆధిపత్యం అణచి వేత మాత్రమే ఈ సమాజానికి ఒనకూడిన జ్ఞానం అనీ, అసలిక్కడ జాతి లేకుండానే జాతీయ వాదాలు పరిడవిల్లాయి అని పెరియార్, మా గురువు అలోసియస్ ల సమక్షంలో నేర్చుకున్నా. కానీ ఇన్ని తప్పులు చేసినా కరుణ ఈకాలపు హీరో. పెరియార్,అన్నా,కరుణ ఈ మూడు నక్షత్రాలు మెరీనా బీచ్ లో తాము కలలు గన్న ద్రావిడ దేశం సాకారం కాలేదు అని తమ తలపులను మెరీనా వొడ్డుకేసి బాదుకుంటున్న క్షణాలు చూడనీకి పోవాలి అనిపిస్తోంది.

“స్వాభిమాన రాజకీయాల లో తలపండిన ఈ యోధుడు కన్న కొడుకుల వైరాన్ని, స్వాభిమాన రాజకీయాల్లో గెలిచి ఓడిన ఒక విఫల యోధుడి నిష్క్రమణానంతరం శూన్యం” కరుణానిధి అలియాస్ కలైన్గర్.

 

(*కవి, పండితుడు,విమర్శకుడు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పొందారు.)