మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్

sarath kumar ready to alliance with kamalhasan party

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్త పొత్తులు మొదలవుతున్నాయి. మూడో కూటమి దిశగా అడుగులు పడుతున్నాయి. కమల్‌ హాసన్‌ పార్టీ నేతృత్వంలో మూడో కూటమికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. అయితే పలు పార్టీల అధినేతలతో శరత్‌ కుమార్‌ భారీగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

sarath kumar ready to alliance with kamalhasan party
sarath kumar ready to alliance with kamalhasan party

అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత నాలుగైదు రోజుల కిందట సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) అదినేత కమల్‌ హాసన్‌ కీలక వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన నాయకత్వంలో మూడో కూటమి ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎంఎన్‌ఎం 4వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కమల్‌ హాసన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో మూడో కూటమి అవకాశాలున్నట్లు భావిస్తున్నానని అన్నారు. పరిస్థితులు అందుకు అనుకూలంగా మారుతున్నాయిన ఆయన అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే నా నాయకత్వంలోనే ఇది జరగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

మరో వైపు ద్రవిడ మున్నేట్ర కళగమ్‌ (డీఎంకే) అంగీకరిస్తే కూటమికి సిద్ధంగా ఉన్నట్లు కమల్‌హాసన్‌ చెప్పారు. డీఎంకే రహస్య ప్రతినిధి తమను సంప్రదించారిన చెప్పినట్లు అన్నారు. పార్టీ అధిష్టానం నుంచి నేరుగా ఆహ్వానం అందితేనే పొత్తను అంగీకరిస్తామని స్పష్టం చేశారు. అయితే అధికార పార్టీ అన్నాడీఎంకే – బీజేపీ – కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటములు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి మరణం అనంతరం రాష్ట్రంలో జరగబోయే తొలి మొదటి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇలా తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి.