అమెరికాలో ముగ్గురు నల్లగొండ జిల్లా విద్యార్దుల మృతి

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు చనిపోయారు. నల్లగొండ జిల్లా నేరెడిగొమ్ము మండలం గుర్రపు తండాకు చెందిన నాయక్ పిల్లలు శారూన్‌నాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచితలు ఉన్నత విద్యాబ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. క్రిస్మస్ సందర్బంగా తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంటల్లో నలుగురు చనిపోయారు.

అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని కొలిర్ విల్లేలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నలుగురు తప్పించుకునే వీలు లేకుండా పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కరీ అనే మహిళతో పాటు శారూన్‌నాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచిత ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదం నుంచి కరీ భర్త డానియెల్, కుమారుడు కోల్ ప్రాణాలతో బయటపడ్డారు. స్మోక్ అలారం లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికాలో చదువుకుంటున్న వీరంతా క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో బంధువులైన డానియెల్, కరీ ఇంటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గుర్రపుతండాలో విషాదం నెలకొంది. 

ప్రమాదం జరిగిన ఇల్లు ఇదే