బిజెపి అనుకూల ముద్ర పడిన రిపబ్లిక్ టీవి మీద, దాని ఎడిటర్-ఇన్- చీఫ్ ఆర్నబ్ గోస్వామి మీద హ్యాకింగ్ కేసు ఎప్ ఐ ఆర్ నమోదు చేయాలని న్యూఢిల్లీ పటియాల హౌస్ కోర్టు ఢిల్లీ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ కేంద్రమంత్రి శశిధరూర్ ఫిర్యాదును పరిశీలించాక కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆర్నబ్ గోస్వామి తన ఇ-మెయిల్ అకౌంట్ లోకి చొరబడి కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లను తస్కరించాడన ఆయన ఆరోపించారు. విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లను మరొకరితో షేర్ చేసుకోడానికి వీల్లేదని ఢిల్లీ పోలీసులు చాలా స్పష్టంగా ఆర్ టి ఐ అభ్యర్థనలకు స్పందిస్తూ తెలిపిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. తన న్యూస్ చానెల్ వ్యూయర్ షిప్ ను పెంచుకునేందుకు ఆర్నబ్ తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని కూడా థరూర్ కోర్టుకు తెలిపారు.
తన ఇమెయిల్స్ లోకి చొరబడి ఆర్నబ్, ది రిపబ్లిక్ టివి ఈ డాక్యుమెంట్లను తస్కరించారని కూడా థూరూర్ కోర్టుకు తెలిపారని బార్అండ్ బెంచ్ వెబ్ సైట్ పేర్కంది.
“It is alleged that proposed accused persons illegally accessed those confidential documents and shown/broadcast them on their News Channel. It is alleged that proposed accused persons accessed the complainant’s Email account without his authority or consent and shared the personal Emails on their News Channel.”
శశిథరూర్ తరఫున సీనియర్ న్యాయవాదులు వికాస్ పాహ్వా , న్యాయవాదులు గౌరవ్ గుప్తా, మమహ్మద్ అలీఖాన్ హాజరయ్యారు.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ జనవరి 21 ఉత్తర్వు జారీ చేస్తూ నిందితుల మీద ఎప్ ఐ ఆర్ తయారుచేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
“This court is of the considered view that in view of allegations leveled by complainant and material produced on record in the form of RTI replies and other material, matter disclosed commission of cognizable offence. In these circumstances, SHO concerned is directed to register FIR in this matter and investigate the same as per law.”
ఇప్పటికే శశిథరూర్ గోస్వామి మీద రు 2 కోట్ల రుపాయల నష్టం దావా కూడా వేసి ఉన్నారు.