తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యపరిస్థితి విషమంగా మారినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడు కావేరి హాస్పిటల్ వైద్య్బృందం సోమవారం ౬:౩౦ కు రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో ధృవీకరించింది. 24 గంటలు గడిస్తే కానీ ఆయన శరీరం ట్రీట్మెంట్ కు సహకరిస్తే ఆరోగ్య పరిస్థితి నిర్ధారణ అవుతుంది. వయసు పైబడిన కారణంగా ఆయన శరీరంలో ముఖ్యమైన అవయవాలు వైద్యానికి సహకరించట్లేదు.
అత్యవసర వైద్య చికిత్సతో ఆయనను నిరంతర పర్యవేక్షణలో ఉంచాము. 24 గంటలు వైద్యానికి సహకరిస్తే కానీ ఆయన ఆరోగ్య స్థితిపై నిర్ధారణ వస్తుంది అని హెల్త్ బులిటెన్ లో తెలిపారు వైద్యులు. ఇప్పటికే మంత్రి పొనుమూడి, దురై మురుగన్ హాస్పిటల్ కి చేరుకున్నారు.
జులై 28 న రక్తపోటుతో కారణంగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనగానే ఉంది. జులై 29 న ఆయన కోలుకుంటున్నారు అని తెలిపిన ఆరోగ్య బృందం మెరుగైన చికిత్స కోసం కొన్ని రోజులు ఆయన హాస్పిటల్ లోనే ఉండాల్సొస్తుంది అని తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతలు కరుణానిధిని పరామర్శించారు. రోజూ వీఐపీలతోపాటు అభిమానులు కూడా హాస్పిటల్ కి వస్తున్నారు.