మోదీ మీద మరొక దెబ్బవేసిన కర్నాటక

million dislikes for man ki beat modi twitter account hacked

కర్ణాటక ప్రజలు ప్రధాని మోదీ మీద మరొక దెబ్బ వేశారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయిన పరాభవం నుంచి  భారతీయ జనతా పార్టీ ఇంకా కోలుకోలుకోనే లేదు,  రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మీద కన్నడిగులు మరొక వేటు వేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఇప్పటివరకు ప్రకటించిన 2709  ఫలితాల్లో 982 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. 329 చోట్ల జేడీఎస్‌ అభ్యర్థులు జయ కేతనం ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ 929   స్థానాలతో రెండో స్థానంలో ఉంది.  షిమోగా, మైసూర్‌, తుముకూరు నగరాలలో మాత్రమే బీజేపీ ఆధిపత్యం కనబర్చింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, జెడిఎస్ చేతులు కలిపిన ప్రయోగం మీద ప్రజలు విశ్వాసం ఉంచారని, ఆ విషయంలో కాంగ్రెస్ మీద గాని, కుమార స్వామి ప్రభుత్వం మీద గాని ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేదని ఈ  ఎన్నికలు రుజువు చేశాయి.

మొత్తం 2662 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

మైసూరులో  మాత్రం 62 స్థానాలలో 22 స్థానాలు గెల్చుకుని బిజెపి అతి పెద్ద పార్టీగా నిలబడింది. ఇక్కడ కాంగ్రెస్  కు 19, జెడిఎస్ కు 18 స్థానలు దక్కాయి. తుమకూరులో  35 స్థానాలలో  బిజెపి 12 సీట్లు గెల్చుకుంది.  మైసూరు , తుమకూరులలో హంగ్ వచ్చింది.

28 కార్పరేషన్లకు, 53 మునిసిపాలిటీలకు, 20 నగరపంచాయతీలకు ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి.

కోస్టల్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. ఉత్తర కర్ణాటకలో స్వతంత్రుల హవా నడిచింది. స్థానిక ఫలితాలు నిరాశపరిచాయని బీజేపీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఇక ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్-జేడీఎస్ కార్యకర్తలు సంబరాలకు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్-జేడీఎస్‌ పొత్తుకు జనామోదం ఉందని రుజువైందని దేవెగౌడ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో తేల్చుకుందామని బీజేపీ నేతలు తమ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. 102 స్థానిక సంస్థల్లో ఆగస్టు 31న పోలింగ్‌ జరిగింది. 102 స్థానిక సంస్థల్లో మొత్తం 2,664 సీట్లకు ఎన్నికలు జరిగాయి.