ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన యువతి.. మళ్లీ తిరిగి రావడంతో షాక్.. అసలేం జరిగిందంటే?

సాధారణంగా అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చనిపోయిన వ్యక్తి మళ్ళి బ్రతికి వచ్చాడు అనే వార్తలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. తాజాగా ఇటీవల కూడా అటువంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. 2015లో కనిపించకుండా పోయిన బాలిక తాజాగా ఇద్దరు పిల్లలతో ప్రత్యక్షం అయింది. బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒక గుర్తు తెలియని యువతీ మృతదేహం లభించడంతో తల్లిదండ్రులకు అమృతదేహాన్ని చూపించగా వారు తమ కూతురేనని నిర్ధారించారు. దీంతో ఆ యువతి హత్యకు విష్ణు అనే యువకుడు కారణమని పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఏడేళ్లుగా జైలులో ఉంచి శిక్ష వేశారు.

అయితే తన కుమారుడు ఏ తప్పు చేయలేదని భావించిన విష్ణు తల్లి ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో యువతి ఉన్న జాడను తెలుసుకొని పోలీసులకు తెలియజేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆగ్రాలో భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్న సదరు యువతిని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో భాగంగా.. 2015లో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయానని సదరు యువతి వెల్లడించింది.

అయితే పోక్సో కోర్టు సదరు యువతికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ కేసులో రాజీ పడమని బలవంతం చేస్తున్నట్లు విష్ణు తల్లి ఆరోపణలు చేస్తుంది. అంతే కాకుండా ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా తన కొడుకుని ఏడేళ్ల పాటు జైలులో ఉంచి శిక్షించారని ఎలాగైనా తమకు న్యాయం చేయాలని విష్ణు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో పోలిసులు తమ తదుపరి విచారణ జరుపనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు కళ్ళు కప్పి ప్రేమించిన వారితో వెళ్ళిపోయి ఆ యువతి సంతోషంగా ఉంటే విష్ణు మాత్రం చేయని నేరానికి ఏడేళ్లుగా జైలశిక్ష అనుభవిస్తున్నాడని ఎలాగైనా అతనికి న్యాయం జరిగేలా చూడాలని అతని కుటుంబ సభ్యులతో పాటు నేటిజన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.