గ‌త 24 గంట‌ల్లో.. ఇండియాలో క‌రోనా ప‌రిస్థితి ఇదే..!

భారత్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ, అధికార‌ యంత్రాంగాలు, అన్ని ర‌కాలుగా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా, దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డంలేదు. ఇక గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో రికార్డు స్థాయిలో 29,429 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే క‌రోనా కార‌ణంగా 582 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య 9,36,181 చేరుకోగా, కరోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 24,309కి పెరిగింది. అలాగే దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,92,032 మంది క‌రోనా నుండి కోలుకోగా, 3,19,840 మంది క‌రోనా పేషెంట్లు ఆస్ప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజులో 3,20,161 శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో, ఇండియాలో 3వ స్థానంలో ఉండగా, మరణాల్లో మాత్రం 8వ స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.