కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి బయట పడిన దగ్గర నుంచి నిరంతరంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల ఫలితాలు సత్పలితాలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎలా లేదన్నా? ఏడాదికి పైగా సమయం పడుతుందని డబ్లూ హెచ్ ఓ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలు కన్నా భారత్ దే కాస్త ముందడుగు పడింది. భారత్ బయోటిక్స్ కోవాగ్జిన్ ఔషదాన్ని ఆగస్టు 15 కల్లా అందుబాటులో తీసుకొస్తుందని ఐసీఎమ్ఆర్ ప్రకటించడం తో ఊరట లభించింది. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా ఇంకెంత మంది ప్రాణాలు బలి తీసుకుంటోదనన్న ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా ప్రభుత్వం ఆదివారం గుడ్ న్యూస్ చెప్పింది. సెచెనోవా యూనివర్సీటీ ఆధ్వర్యంలో తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాని ప్రకటించింది. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో వాలంటీర్లపై తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీస్‌తో తెలిపారు.
ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న తొలి బృందం బుధవారం డిశ్చార్జ్ అవుతుందని ప్రకటించింది. ఇక రెండవ బృందం జులై 20 డిశ్చార్జ్ అవుతుందని తెలిపింది. ఇది ప్రపంచ దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. మాస్కోకి చెందిన గమలీ గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్‌ను గత నెల జూన్ 18న ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్ ఇప్పటికే కొన్ని రకాల మాత్రలను, ఇంజెక్షన్లను కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చింది.