ఓ అబ్బాయ్.! నీకు మార్కెట్ లేదోయ్.!

యంగ్ హీరో అనలేంగానీ.. సీనియర్ హీరో అయితే కాదు.! సినిమా రంగానికే చెందిన కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చాడు. చేసిన సినిమాలు చేసినట్టే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నా, పట్టు వదలని విక్రమార్కుడిలా పలు సినిమాలు చేశాడు. ఫ్లాపుల పరంపర మాత్రం కొనసాగుతూనే వుంది.

మధ్యలో విసిగిపోయి, సినిమాల్ని వదిలేసినట్లుగా వ్యవహరించాడు. ఏవో వ్యాపార కార్యకలాపాలు చూసుకున్నాడు. మళ్ళీ సినీ రంగంలోకి వచ్చి, ఒకటో రెండో సినిమాలు చేశాడు. మార్కెట్ జస్ట్ జీరో.!

కానీ, ఓ పాతిక ముప్ఫయ్ కోట్ల బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. యాభై కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టు అట. ఓ ఇరవై కోట్లు పెట్టే నిర్మాత కోసం చూస్తున్నాడట ఆ హీరో. ‘నీకంత మార్కెట్ లేదబ్బాయ్..’ అంటున్నారట సినీ పరిశ్రమలో సదరు హీరోగా సన్నిహితులు.

‘అయితే, నేనే తీసుకుంటా’ అంటూ ఓ పీరియాడిక్ సబ్జెక్ట్ (వేరొకరి కథకి మార్పులు చేసుకుని, సొంత కథగా చెప్పుకుంటున్నాడు) మీద కసరత్తులు ప్రారంభించేశాట. ఎవరా హీరో.? ఏమా కథ.!