సినీ నటన పరంగా చూసుకుంటే.. రెండు మూడు సినిమాల వయసే వుంది.. కానీ, మనోడి రేంజ్ ఇప్పుడు ఇంకోలా వుంది. ఓ మోస్తరు యంగ్ హీరోలు వసూలు చేసే కోటి రూపాయల మార్క్ వరకూ చేరుకున్నాడట.
చేతిలో ఐదు సినిమాలున్నాయనీ, అదంతా ఈ మధ్యనే కొట్టిన ఓ హిట్టు ప్రభావమేననీ అంటున్నారు. కథ వినాలంటేనే బోల్డన్ని కండిషన్లు పెడుతున్నాడట ఆ ‘బుల్లి’ నటుడు.! ‘గాలి’ వాటం అలా వుంది మరి.!
పేరున్న హీరోయిన్ కావాలంటూ దర్శక నిర్మాతల మీద ఒత్తిడి కూడా తెచ్చేస్తున్నాడట. ఈ ఉగాదికి ఓ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోందట కూడా.! దశ తిరగడం అంటే ఇదే మరి.!
ఓ మోస్తరు హీరోలేమో ఏ సినిమా చేయాలో తెలియక గిలగిల్లాడుతోంటే.. ఇదిగో ఇలాంటోళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఐదారు కోట్లు లేనిదే ఇలాంటోళ్ళతో సినిమా చేయడం కూడా కష్టమవుతోందిట.
