కేజీఎఫ్ పై నా మాటలు వెనక్కి తీసుకోను – మళ్ళీ షాకింగ్ స్టేట్మెంట్

KGF 2 Creates Sensation

గత ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన సినిమాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా టాక్ పరంగా ఏమంత గొప్ప టాక్ తెచ్చుకోలేదు. పార్ట్ 2 కన్నా పార్ట్ 1 ఎక్కువ ఇష్టం అని చెప్పిన వారు ఇప్పటికీ ఉన్నారు.

అయితే తాజాగా టాలీవుడ్ కి చెందిన రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ కలిగిన యువ దర్శకుడు నటుడు వెంకటేష్ మహ కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. సినిమా పేరు ఎక్కడా చెప్పకుండా ఒక నీచ్ కమీన్ కుత్తే గాడు క్లైమాక్స్ లో తన బంగారం అంతా తీసుకెళ్ళిపోయి తన ప్రజలని వదిలేసి వెళ్ళిపోతాడా అంటూ కామెంట్స్ చేసాడు.

ఇది ఒక్కసారిగా వైరల్ గా మారగా వీటిపై తాను స్పందించాడు. ఇప్పుడు కూడా ఈ మాటలు నేను వెనక్కి తీసుకోను కానీ అలా మాట్లాడిన విధానం కి నేను తప్పు చేసానని ఒప్పుకుంటానని అంతే తప్ప ఆ సినిమా పట్ల నా అభిప్రాయం మార్చనని ఖరాఖండిగా చెప్పేసాడు.

అంతే కాకుండా అదే వీడియోలో నేను మరో కన్నడ సినిమాని ప్రైస్ చేసానని ఈ సినిమా విషయంలో మాత్రం నా ఒపీనియన్ మార్చనని చెప్పేసాడు. దీనితో మరోసారి ఈ స్టేట్మెంట్ తో మన తెలుగు ఆడియెన్స్ కూడా ఈ యువ డైరెక్టర్ పై మండిపడుతున్నాడు. మొత్తానికి అయితే అతను పెట్టి వేదిలేసిన నిప్పు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి తన వీడియో మరోసారి వైరల్ గా మారింది.