వైరల్ : “సలార్”, “కేజీఎఫ్ 2” ల లింక్ పై మరో మైక్రో డీటెయిల్.. 

కన్నడ సినిమా దగ్గర భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఒక్క కన్నడ లోనే కాకుండా హిందీ తెలుగులో కూడా బాగా దగ్గరైపోయాడు. తన గత చిత్రాలు కేజీఎఫ్ సిరీస్ తో ఓ రేంజ్ లోకి తాను వెళ్లిపోగా వాటి తర్వాత వాటికి మించి బిగ్గెస్ట్ ఏక్షన్ థ్రిల్లర్ లాంటి సినిమాతో వస్తున్నాను అని పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో “సలార్” ని అనౌన్స్ చేసాడు.

దీనితో ఈ కాంబో పై అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోగా ఇప్పుడు ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై అయితే ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చింది. అయితే గత కొన్నాళ్ల నుంచి ప్రశాంత్ నీల్ మైంటైన్ చేస్తున్న సస్పెన్స్ పై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ అవుతున్నాయి.

ఇప్పటికే సినిమాలో చాలా వరకు కేజీఎఫ్ 2 తో లింక్ ఉందని టాక్ వచ్చింది. అందులో భాగంగానే సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చే టైం లతో కేజీఎఫ్ 2 లోని క్లైమాక్స్ లో రాకీ ఉండే షిప్ లో ఉండే ఓ గడియారంలో సేమ్ టైం కి సలార్ అప్డేట్స్ కూడా వస్తుండడం ఒక క్రేజీ థింగ్ గా మారింది.

దీనితో అక్కడ నుంచే ఈ వెర్షన్ లు స్టార్ట్ కాగా మళ్ళీ అదే సమయానికి సలార్ ట్రైలర్ ని కూడా అనౌన్స్ చేసి ఫిక్స్ చేయడంతో మరోసారి ఆ మైక్రో డీటెయిల్ వైరల్ గా మారింది. దీనితో ఈ రెండు సినిమాలకి పార్లల్ గా కనెక్షన్ ఉంది అని అంతా అంటున్నారు. మరి ఇదంతా ట్రైలర్ లో రివీల్ కాకపోయినా డిసెంబర్ 22న మాత్రం ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది.