ప్రశాంత్ నీల్ గాలి తీసేస్తుంది అందుకేనా..?

974410-prashanth-neel (1)

చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజీ తెచ్చుకున్న స్టార్ దర్శకుల్లో అయితే ప్రస్తుతం మన తెలుగు నుంచి సందీప్ రెడ్డి వంగ అలాగే కన్నడ సినిమా నుంచి దర్శకుడు ప్రశాంత్ నీల్ లు ఉన్నారని చెప్పాలి. కాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఒకో సినిమాపై కూడా సెపరేట్ అంచనాలు నెలకొనగా ఈ చిత్రాల్లో అయితే ఇప్పుడు సలార్ సినిమా రిలీజ్ తో రాబోతున్నాడు.

అయితే గత కొన్నాళ్ల నుంచే ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ఇస్తున్న ఒకో ట్విస్ట్ తో ఫ్యాన్స్ లో డిజప్పాయింట్మెంట్ పెరిగిపోతుంది. సలార్ కి కేజీఎఫ్ కి ఎలాంటి సంబంధం లేదని నీల్ మొదట కన్ఫర్మ్ చేయడంతో చాలా మందిలో అంచనాలు తగ్గిపోయాయి.

ఇక తాజాగా తాను ఇచ్చిన మరో స్టేట్మెంట్ తాను ఇలా ఒక సినిమా యూనివర్స్ ని ఇంకో సినిమాలోకి యాడ్ చేయడం ఇష్టం లేదు దేని పని దానిదే అంటూ చెప్పడం మరిన్ని డౌట్స్ తీసుకొచ్చింది. అయితే ఇవన్నీ నిజంగానే సినిమా యూనివర్స్ లకి సంబంధం లేదా లేక ప్రశాంత్ నీల్ ఎగ్జైట్మెంట్ ని ముందే రివీల్ చేయకూడదు

అని ఇలా చెప్తున్నాడా అనేది కూడా చాలా మందిలో సందేహం ఉంది. లాస్ట్ టైం కూడా లియో సినిమా విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అన్నీ థియేటర్స్ లోనే చూసి తెలుసుకోండి అని చెప్పేసాడు. మరి బహుశా నీల్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తుంది.

ముందు ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ చేసి తీరా సినిమాలో కనెక్షన్ లాంటిది ఏమన్నా ఇస్తే ఇక ఆ హై ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు మరి అలా ప్రశాంత్ నీల్ ఏమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు అని కొందరు అనుకుంటున్నారు.