కాస్త లేటయినా యష్ సినిమాని మామూలు లెవెల్లో ప్లాన్ చెయ్యట్లేదే.. 

ప్యాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సౌత్ హీరోస్ లో అయితే కన్నడ సినిమా నుంచి కూడా ఓ హీరో ఉన్నాడు. మరి అతడే యష్. కాగా యష్ నటించిన గత చిత్రాలు కేజీఎఫ్ తో సెన్సేషనల్ మార్కెట్ అండ్ క్రేజ్ ని తాను తెచ్చుకోగా మళ్ళీ కేజీఎఫ్ 2 తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేసి స్టార్ట్ చేయడానికి మాత్రం తాను చాలా సమయం తీసుకున్నాడు.

కానీ ఈ ఆలస్యం అంతా కూడా సినిమాని ఊహించని లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ “టాక్సిక్” ఫిక్స్ కాగా ఇందులో కూడా తాను ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడని టాక్ వచ్చింది. మరి ఏ భారీ సినిమాని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో అయితే అసలు ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్లో ప్లానింగ్ చేస్తూ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సినిమాకి వాడుతున్న కెమెరా ఎక్విప్మెంట్ అవన్నీ చూస్తుంటేనే అసలు సినిమాని ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో అనేది అర్ధం అవుతుంది. దీనితో ఈ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఫ్యాన్స్ అయితే వీటిని చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి మరి.