తనకి పుట్టబోయే కొడుకు గే అని తెలిస్తే ఆ పని చేస్తా.. రకుల్ కామెంట్స్ వైరల్?

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా రకుల్ నటించిన మొదటి సినిమాలోని తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగు లో రకుల్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రకుల్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో వచ్చిన గుర్తింపుతో ఈ అమ్మడికి బాలీవుడ్ నుండి కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా హిందీలో ఈ అమ్మడు నటించిన డాక్టర్ జి సినిమా విడుదల అయింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో ప్రేమలో పడిన రకుల్ తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీతికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

గతంలో 2011 లో మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోటీలో పాల్గొన్న రకుల్ కి …ఒకవేళ మీకు పుట్టే కొడుకు గే అని తెలిస్తే మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించారు. దీనికి రకుల్ స్పందిస్తూ… ఈ విషయం గురించి నాకు తెలియగానే మొదట నేను షాక్ అవుతా… వెంటనే అతన్ని చెంపదెబ్బ కొడతాను. కానీ ఆ తర్వాత ఆలోచించి… అతని నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఒకవేళ అతను అదే దారిలో వెళ్ళాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు. నాకు అబందించినంతవరకు నేను ఎప్పుడు ముక్కుసూటిగా ఉండేందుకే ఇష్టపడతాను అంటూ సమధానం చెప్పింది. ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.