అనుష్క శెట్టి ఆ రిస్క్ తీసుకుంటుందా.?

సినిమాలు చేయడంపై అనుష్క శెట్టి ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించడంలేదు. వయసు మీద పడటం వల్లేనా.? అంటే, వయసు మీద పడ్డాక కొత్త ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లనీ చూస్తున్నాం కదా.?

ఇంకో బలమైన కారణం ఏదో వుండే వుంటుంది.! తెరపై అనుష్క పవర్‌ఫుల్ రోల్స్‌లో కనిపిస్తే, బాక్సాఫీస్ వసూళ్ళు అదిరిపోతాయ్.! ఆ సంగతి అనుష్కకీ తెలుసు, అనుష్కతో సినిమాలు చేయడానికి రెడీగా వున్న దర్శక నిర్మాతలకీ తెలుసు.

అనుష్క అంటేనే యోగా బ్యూటీ.! కానీ, అది ఒకప్పుడు. ఫిట్నెస్ మీద అదుపు కోల్పోయింది అనుష్క. అదంతా ‘సైజ్ జీరో’ సినిమా ఎఫెక్టే. అప్పటినుంచే అనుష్కకి శారీరక ఇబ్బందులు మొదలయ్యాయంటారు.

అసలు విషయమేంటంటే, అనుష్కతో ఓ పవర్ ఫుల్ ఫిలిం కోసం సన్నాహాలు జరిగాయి. చివరి నిమిషంలో అనుష్క ఆ సినిమా చేయలేనని చేతులెత్తేసిందట. యాక్షన్ బ్లాక్స్ వుంటాయట, ఒకింత శారీరక శ్రమ ఎక్కువే చేయాల్సి వుంటుందట ఆ సినిమా కోంస అనుష్క. అందుకే, ఆ ప్రాజెక్టుని అనుష్క వదిలేసుకుందని అంటున్నారు.

మొన్నీమధ్యనే అనుష్క ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.! ఆ సినిమాలో అనుష్క పెద్దగా కష్టపడాల్సి రాలేదు.. శారీరక శ్రమ పరంగా. కానీ, అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్ అంతే.!