తివిక్రమ్ కి జగన్ మాత్రం ఎందుకు కనపడట్లేదు?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో తివిక్రమ్ ఒకరు. ఆయనతో సినిమాలు చేయాలని హీరోలు చాలా ఉత్సాహం చూపిస్తారు. ఈ మాటల మాంత్రికుడు సినిమా తీస్తే అది కచ్చితంగా మ్యాజిక్ అవుతుంది. ఆయన కలం నుంచి వచ్చే మాటలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడంటే ఆయన స్టార్ డైరెక్టర్ గా అందరికీ తెలుసు. కానీ ఆయన ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడో తెలుసా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి వల్లే త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట.

తివిక్రమ్ మామగారు అంటే ఆయన భార్య సాయి సౌజన్య తండ్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి స్వయానా సోదరుడు. సౌజన్య చిన్నతనంలో ఎక్కువగా సిరివెన్నెల ఇంట్లోనే పెరిగారట. ఆయనే తివిక్రమ్ టాలెంట్ గుర్తించి, ఇండస్ట్రీకి తీసుకువచ్చారట. తివిక్రమ్ ని ఇండస్ట్రీకి తీసుకువచ్చిన క్రెడిట్ కూడా సిరివెన్నలకే దక్కుతుంది. ఆయన పట్ల కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంది.

కాగా, కొంత కాలం క్రితం అనారోగ్య సమస్యల కారణంగా సిరివెన్నెల తుదిశ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. అయితే, సిరివెన్నెల అనారోగ్యం బాగోని సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లక్షలాది రూపాయలతో ఆసుపత్రి ఖర్చులు మొత్తం భరించింది.. ఆయన మరణానంతరం కూడా వైజాగ్‌లోని విలువైన ప్లాట్‌ను ఆయన కుటుంబానికి గౌరవార్థం ఇచ్చారు.

తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి విషయంలో, ఆయన కుటుంబం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పనికి తివిక్రమ్ ఏరోజూ కృతజ్ఞతలు చెప్పలేదు. సిరివెన్నెల కుటుంబం పట్ల జగన్ ప్రభుత్వం చేసిన పనికి ఎలాంటి గుర్తింపు రాకపోవడం గమనార్హం. సహాయం చేసి తిరిగి పొగడ్తలు ఆశించడం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ, తమకు అంత అండగా నిలిచిన జగన్ ని ఆయన గుర్తించకపోగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడటమే ఇప్పుడు సమస్యగా మారింది.

ఇటీవల తివిక్రమ్ సీఎం కేసీఆర్ ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు, కేసీఆర్ పై అభిమానాన్నిచాటుకుననాడు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో కేసీఆర్ కృషి గొప్పది అంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలో జగన్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. మీ కుటుంబం కోసం అంత చేసినా, జగన్ మాత్రం మీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తుండటం గమనార్హం. మరి దీనికి తివిక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.