Home News 'అ 'అక్ష‌రం పేరుతో ఉన్న వాళ్లు నామినేష‌న్‌లోకి.. టైం చూసి అఖిల్‌కు హ్యాండ్ ఇచ్చిన మోనాల్

‘అ ‘అక్ష‌రం పేరుతో ఉన్న వాళ్లు నామినేష‌న్‌లోకి.. టైం చూసి అఖిల్‌కు హ్యాండ్ ఇచ్చిన మోనాల్

బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌ర‌కి అర్దం కాదు. ఎలిమినేట్ అవుతార‌ని అనుకున్న వాళ్లు హౌజ్‌లో ఉంటారు. సేఫ్ అవుతారని అనుకున్న‌వాళ్ల‌మో బిగ్ బాస్ హౌజ్ గేట్స్ దాటి బ‌య‌ట‌కు వెళ‌తారు. ఇదంతా కేవలం ప్రేక్ష‌కుల చేతుల‌లోనే ఉంటుంద‌ని చెబుతున్న బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మందిని బ‌య‌ట‌కు పంపారు. 12వ వారంలో మ‌రో వ్య‌క్తిని ఎలిమినేట్ చేయ‌నుండ‌గా, ఇందుకోసం నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఏర్పాటు చేశారు. ఒకరికొక‌రు నామినేట్ చేసుకోకుండా అదృష్టాన్ని ప‌రీక్షించుకునే గేమ్ ఇచ్చారు. దీని ప్ర‌కారం బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు బ‌య‌ట ఉన్న హ్యాట్స్ లో రెడ్‌ది పెట్టుకున్న వాళ్లు నామినేష‌న్ అవుతార‌ని, గ్రీన్ హ్యాట్ పెట్టుకున్న వాళ్లు సేవ్ అవుతారని చెప్పుకొచ్చారు

Monal Count | Telugu Rajyam

అయితే ఈ టాస్క్‌లో అ పేరుతో ఉన్న కంటెస్టెంట్స్ నామినేట్ కావ‌డం విశేషం. అరియానా, అభిజిత్, అవినాష్‌, అఖిల్‌లు రెడ్ హ్యాట్ పెట్టుకోవ‌డంతో వారు నామినేష‌న్ జోన్‌లోకి వెళ్లారు. ఈ ప్ర‌క్రియ‌పై అవినాష్ సీరియ‌స్ అయ్యాడు. గేమ్ ఆడ‌లేద‌ని చెప్పి ఇంట్లో కూర్చోవాలా అంటూ బిగ్ బాస్ నే ప్ర‌శ్నించాడు. ఇందుకు అభిజిత్ కూడా వంత పాడాడు. ఏం చేస్తాం బ్ర‌ద‌ర్ మ‌న రాత అని అన్నాడు. ఇంత‌లోనే నామినేష‌న్ ప్ర‌క్రియ ఇంత‌టితో ముగిసిపోలేద‌ని బిగ్ బాస్ చెప్ప‌గా, బ‌య‌ట ఉన్న వాళ్ల‌తో ప్లేస్ మార్చుకోవ‌చ్చు అని అన్నాడు.

రంగంలోకి దిగిన మోనాల్.. అరియానా, అవినాష్‌ల‌ను సేవ్ చేయ‌న‌ని చెప్పింది. ఇక అఖిల్ విష‌యంలో కాస్త పాజిటివ్ గా స్పందిస్తుంద‌ని అంతా ఊహించిన‌ప్ప‌టికీ అభిజిత్‌ని బయ‌ట‌కు పంపి తాను నామినేష‌న్ జోన్‌లో నిలుచొంది. దీంతో అంద‌రు అవాక్క‌య్యారు. ఇప్పుడు అస‌లు ఆట ఏంటో అర్ధమైంది అంటూ అఖిల్ మోనాల్ వైపు సీరియ‌స్‌గా చూశాడు. ఇన్ని రోజులు స‌పోర్ట్ చేసిన త‌న‌ని కాద‌ని అభిజిత్‌ని మోనాల్ సేవ్ చేయ‌డం అఖిల్‌కు నెత్తిన కుంప‌టి పెట్టినంత ప‌నైంది. అస‌లే గ‌త‌వారం కెప్టెన్సీ టాస్క్‌లో స‌పోర్ట్ చేయ‌లేద‌ని గీ పెడుతున్న అఖిల్‌.. ఇప్పుడు మోనాల్ చేసిన ప‌నికి మ‌రింత కోపంగా ఉన్నాడు. తాజాగా విడుద‌లైన ప్రోమోని బ‌ట్టి చూస్తే అఖిల్, అరియానా, అవినాష్‌,మోనాల్ నామినేష‌న్లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News