AkshayaTritiya: అక్షయ తృతీయ మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన రోజులలో ఈ అక్షయ తృతీయ ఒకటి. ఈ అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ఈ విధంగా బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చాలామంది భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం దుకాణాలు అన్ని జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఇకపోతే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం బ్రహ్మ కుమారుడు అక్షయ్ వైశాఖమాసం శుక్ల తృతీయ తేదీన జన్మించారు. గంగాదేవి అవతరణ,పరశురాముడు జయంతి కూడా ఇదే రోజు కావడంతో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా బ్రహ్మ కుమారుడు జన్మించడం వల్ల ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల తృతీయ తిథి రోజు అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ రోజు కనుక బంగారు వెండి నగలను కొనుగోలు చేయడంతో ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు మహావిష్ణువుకి కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందనే విషయానికి వస్తే మే 3, 2022 న అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఇక ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే మూడవ తేదీ ఉదయం 05:18 నుంచి మే 4, వ తేదీ 07:32 వరపు అక్షయ తృతీయ సమయం ఉంటుంది కనుక ఈ సమయంలో బంగారు కొనుగోలు చేయవచ్చు ఒకవేళ అక్షయ తృతీయ రోజు మహా విష్ణువును పూజించాలి అనుకునేవారు 3వ తేదీ ఉదయం 5:39 నిముషాల నుంచి మధ్యాహ్నం12:18 వరకు ఎంతో అనువైన సమయం.