కాజల్ క్రేజ్ ముందు వాళ్ళెంత అంటున్నారు.. ఆ స్టార్ హీరోయిన్స్ ఇంత క్రేజ్ తెచ్చుకొని ఏం లాభం..?

కాజల్ అగర్వాల్ కి ఉన్న ఫిజిక్, గ్లామర్ మూమూలుగా ఉండదు. కాస్త హాట్ గా కనిపించిందంటే యూత్ లో వేడి పుట్టి అల్లాడిపోతుంటారు. స్పెషల్ సాంగ్స్ లో ఇంకాస్త రొమాంటిక్ లుక్స్ విసిరిందంటే ఇక అక్కడే కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ కొట్టి పడిపోయో వాళ్ళు ఎంతమందో లెక్కపెట్టలేము. ఇండస్ట్రీకొచ్చి 13 ఏళ్ళు అవుతున్నా.. ఈ మద్యనే వచ్చి స్టార్ హీరోయిన్ అయిందన్నట్టుగా ఫ్రెష్ గా కనిపిస్తుంది. అందుకే ఇండస్ట్రీలో ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ లో కాజల్ కి ఇప్పటికే అదే క్రేజ్.

మరో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ ది ఇండస్ట్రీలో దాదాపు ఒకే సారి జర్నీ మొదలు పెట్టారు. ఎవరి క్రేజ్ వాళ్ళ కి ఉన్న్నప్పటికి కాజల్ తో పోల్చుకుంటే అనుష్క రేస్ లో ఎక్కడో ఉంది. అందరూ టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటూ పూజా హెగ్డే, రష్మిక మందన్న లని చూపిస్తున్నారు గాని అసలు చెప్పాల్సింది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని కాజల్ అగర్వాల్ నే.

కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 లో కమల్ హాసన్ కి జంటగా నటిస్తోంది.

ఈ రెండు భారీ సినిమాలతో పాటు యంగ్ హీరో హీరో మంచు విష్ణు నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మోసగాళ్ళు అన్న టైటిల్ తో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇక వెబ్ సిరీస్ లో నటించడానికి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ ఒప్పుకోవాలే గాని ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ కంటే కాజల్ కే ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ ఉందని ఈ విషయంలో ఎవరైనా కాజల్ తర్వాతే అంటున్నారు.