డైరెక్టర్ చెప్పినట్టే నటించాము.. ఆచార్య విషయంలో ఆ ఒక్క బాధ ఉంది.. చిరు కామెంట్స్ వైరల్?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత నటించిన చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.అయితే ఓ మీడియా సమావేశంలో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే మొదటిసారి ఆచార్య ఫ్లాప్ గురించి మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఆచార్య సినిమా ప్రస్తావనకు రావడంతో చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఫ్లాప్ అయినందుకు తాను ఏ మాత్రం బాధపడలేదని తెలిపారు. తన కెరియర్ మొదట్లో ఇలాంటి ఎన్నో సంఘటనలు తనని చాలా బాధ కలిగించాయని ఆ సమయంలో తాను ఎంతో కృంగిపోయానని తెలిపారు.ఇలా తన సినీ కెరియర్ 15 సంవత్సరాల వరకు ఫ్లాప్ సినిమాలు ఎదురైతే బాధపడ్డాను అయితే హిట్ సినిమాలు వస్తే వాటిని తలకి ఎక్కించుకోలేదు.ఇక నటుడిగా ఈ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి ఫ్లాప్ సినిమాల గురించి తాను ఏమాత్రం బాధపడలేదని తెలిపారు.

ఆచార్య సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టే మేము నటించాము అయితే ఈ సినిమా విషయంలో ఒక్క బాధ మాత్రం మిగిలి ఉంది మొదటిసారి నేను చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఇలా ఫ్లాప్ కావడంతో బాధగా ఉంది. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి నటించిన ఈ సినిమాలో కనిపించినంత జోష్ గా కనిపించకపోవచ్చు అంటూ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ మొత్తానికి చిరంజీవి ఆచార్య ప్లాప్ మొత్తం కొరటాల ఖాతాలోనే వేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.